విమానంలో వడ్డించిన ఆమ్లెట్ లో బొద్దింక.. వీడియో

67చూసినవారు
ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికురాలికి వింత అనుభవం ఎదురైంది. ఈ విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించిందని ప్రయాణికురాలు వాపోయింది. ఈ మేరకు ఓ వీడియోని 'ఎక్స్‌'లో షేర్ చేసింది. 'నేను దీన్ని చూసినప్పుడు నా 2 సంవత్సరాల పిల్లవాడు ఆమ్లెట్ సగం తిన్నాడు. దీంతో చిన్నారికి ఫుడ్‌ పాయిజన్‌ ​​అయింది' అని ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన సదరు ఎయిర్ లైన్స్ భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్