గడిచిన రెండు సంవత్సరాల్లో పెరిగిన రుణ డిమాండ్ స్థాయిలో డిపాజిట్ల సేకరణకు బ్యాంక్‌లు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు 2023- 24లో జారీచేసిన రుణాలు రూ.1,64,98,006 కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో (సీడీ రేషియో) ఈ కాలంలో 75.8 శాతం నుంచి 80.3 శాతానికి పెరిగింది. అయితే, వినియోగదారులకు పెట్టుబడులపై ఆసక్తి పెరగడంతో డిపాజిట్లు తగ్గాయని పేర్కొంది.