హైడ్రా పేరుతో వసూళ్లు: కేటీఆర్

85చూసినవారు
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులు పెడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాపై GHMC పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. బిల్డర్లు, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు వసూళ్లు చేయడానికి హైడ్రాను వాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

సంబంధిత పోస్ట్