అవిభక్త కవలలు ఎలా పుడతారంటే?

79చూసినవారు
అవిభక్త కవలలు ఎలా పుడతారంటే?
మోనోజైగోట్‌ ట్విన్స్‌ అవిభక్త కవలలుగా పుట్టే అవకాశం ఉంటుంది. ఫలదీకరణం చెందిన తర్వాత 12 రోజులకు వేర్వేరు శరీరాలు ఏర్పడటంలో వైఫల్యం చెందితే ఇలా జరుగుతుంది. ప్రసవం అనంతరం కొన్ని రోజులు లేదా సంవత్సరాలకు అవిభక్త కవలలుగా పుట్టిన వారిని వేరు చేసే శస్త్ర చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే అలా చేయడానికి ఇద్దరు కవలల గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలు వేర్వేరుగా ఏర్పడి ఉండాలి. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వీణ-వాణి ఇలా జన్మించిన అవిభక్త కవలలే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్