గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం పుంజుకున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 643 పాయింట్లు ఎగబాకి 78,685 వద్ద, నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 23,786 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా 85.03గా కొనసాగుతోంది. టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, ఎల్ అండ్ టీ, RIL, NTPC గ్రీన్ షేర్లు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.