AP: బాలల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ (X) వేదికగా చిన్నారులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ‘‘నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి వారి హక్కులను కాపాడటం, బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడం మన బాధ్యత. బాలల్ని సక్రమమార్గంలో నడిచేలా చేస్తే దేశం కూడా అదే బాటలో పయనిస్తుందనడంలో సందేహం లేదు’’అని తెలిపారు.