TG: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ప్రారంభించింది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి పి. విశ్వనాథన్ ఈ సమావేశాలకు స్వయంగా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.