నేటితో ముగియనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాలు

55చూసినవారు
నేటితో ముగియనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాలు
అహ్మదాబాద్‌లో 64ఏళ్ల తర్వాత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 2 రోజుల కీలక సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. ఇవాళ AICC సమావేశంలో CWC తీర్మానాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల 1200 మందికి పైగా AICC సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచీ పార్టీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్