కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిస్వాశర్మ మరోసారి ఫైరయ్యారు. గాజాలో హింసపై కాంగ్రెస్ చాలా ట్వీట్లు చేసిందని పేర్కొన్నారు. అయితే, బంగ్లాదేశీ హిందువుల కోసం, వారు ఎన్నిసార్లు ట్వీట్ చేశారు? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడైనా ముస్లింలకు ఏ సమస్య వచ్చినా, వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నిరూపించిందని, కానీ హిందువులు సమస్యల్లో ఉంటే వారు ఉండరని ఆయన మండిపడ్డారు.