ఉత్తరఖండ్ డెహ్రాడూన్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా సబ్– ఇన్‌స్పెక్టర్‌పై అస్లాం అనే కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పటేల్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా ఎస్‌ఐ విధులలో భాగంగా ఓ హోటల్‌లో బస చేయడానికి రూం బుక్ చేసుకుంది. ఆమె ఒంటరిగా ఉండటంతో తనిఖీ నెపంతో రూంలోకి వచ్చిన అస్లాం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించింది.