రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఘన్‌పూర్‌లోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన శ్రీరాములు(25), బాలిక (17) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వీరి మరణానికి కారణమైన మహేశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక సమీప బంధువైన మహేశ్.. వీరి ప్రేమ గురించి తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడు. భయపడ్డ శ్రీరాములు పలుదఫాలుగా రూ.1.35 లక్షలు ఇచ్చాడు.