విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ఓ విద్యార్థినితో పారిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో జరిగింది. అభిషేక్ గౌడ్ అనే 25 ఏళ్ల ఉపాధ్యాయుడికి అప్పటికే పెళ్లయి రెండేళ్ల పాప ఉంది. అయితే అతడు ట్యూషన్ చెప్పే ఓ మైనర్ విద్యార్థినితో పారిపోయాడు. దీనిపై నవంబర్ 23న జేపీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు ఆరు వారాల తర్వాత బాలికను టీచర్ నుంచి రక్షించారు.