ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా మదన్‌పురాలో ఉన్న సిద్ధీశ్వర మహాదేవ ఆలయాన్ని ఎట్టకేలకు తెరిచారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు వారణాసి ఏడీఎం సిటీ అలోక్ వర్మ 70 ఏళ్లుగా మూతపడిన సిద్ధీశ్వర మహాదేవ ఆలయ తాళాన్ని తెరిచారు. భారీ పోలీసు బలగాల సమక్షంలో ఆలయ శుద్ధి ప్రారంభించారు. స్థానిక ముస్లింలు కూడా పరిపాలన అధికారులకు సహకరించి శాంతిభద్రతలను కాపాడారు.