సంక్రాంతి నేపథ్యంలో ప్రజలు సొంతూళ్ల బాట పట్టడంతో బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. దీంతో రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై 300లకు పైగా కేసులు నమోదు చేశారు.