AP: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం శ్రీవారిని 71,417 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,396 మంది భక్తులు తమ తలనీలాలను స్వామి వారికి సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.