దారుణం.. 5 నెలల పసికందును దిండుతో అదిమి చంపిన తల్లి

71చూసినవారు
దారుణం.. 5 నెలల పసికందును దిండుతో అదిమి చంపిన తల్లి
ఏపీలో దారుణం జరిగింది. 5 నెలల పసికందును కన్నతల్లే దిండుతో అదిమి చంపింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. విశాఖలోని పెద్దగదిలికి చెందిన భార్యాభర్తలు శిరీష,వెంకటరమణ మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మార్చి 13న భార్య శిరీష తన 5 నెలల కూతురిని ఇంట్లోనే దిండుతో అదిమి చంపేసింది. ఆ తర్వాత తెన్నేటి పార్క్ వద్ద ఉన్న బీచ్‌కు వెళ్లి.. పాప నీటిలో మునిగి చనిపోయినట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త ఫిర్యాదుతో అసలు నిజం తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్