AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వనుంది. ఈ మేరకు జీవో నెంబర్ 30ను విడుదల చేసింది. పట్టా పొందాలనుకునే వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారుల పరిశీలన అనంతరం అర్హులకు పట్టా మంజూరు చేయనున్నారు. 2019 అక్టోబర్ 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో BPL కింద ఉన్న కుటుంబాలు, అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో స్వయంగా ఇళ్లు నిర్మించుకున్నవారు అర్హులు.