బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. అయితే హీరోయిన్ కాజల్ గతంలో బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసిన వీడియో బయటపడింది. ఓ నెటిజన్ ఈ వీడియోను వీసీ సజ్జనర్, ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ సవాల్ విసిరాడు. ‘ఇప్పుడు కాజల్ అగర్వాల్‌ని అరెస్ట్ చేయగలరా? సెలబ్రెటీలకు, సామాన్యుడికి ఎప్పుడూ ఈ పక్షపాతం ఎందుకు?’ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దీనిపై సజ్జనార్ ఎలా స్పందిస్తారో చూడాలి.