దారుణం.. రూ. 300 కోసం స్నేహితుడినే చంపేశారు

79చూసినవారు
దారుణం.. రూ. 300 కోసం స్నేహితుడినే చంపేశారు
జనగామ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రూ. 300 కోసం స్నేహితుడినే హత్య చేసి నిప్పంటించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో జీవనం కొనసాగిస్తున్న వెంకన్నను అతడి మిత్రులు రూ.300 అప్పు అడిగారు. అతను లేవని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంలో వెంకన్నను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్