తమలపాకుల్నే నాగవల్లి ఆకులనీ పిలుస్తారు. ఈ మొక్కను పెంచేందుకు నీరు నిలవని సారవంతమైన మట్టి అవసరం. నీళ్లూ రోజు పోయాలి. దీనికి ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు. నీడలోనూ ఆరోగ్యంగానే ఎదుగుతుంది. దీన్ని కొమ్మ కత్తిరింపుల ద్వారానూ పెంచుకోవచ్చు. తెల్లదోమ కనిపిస్తే చెంచా వేపనూనెను లీటరు నీటిలో కలిపి స్ప్రే చేస్తే సరి. ఎక్కడైనా ఆయిలీ ప్యాచెస్ కనిపిస్తే ప్రూనింగ్ చేసేయండి చాలు.