రెమాల్ తుఫాను.. పశ్చిమబెంగాల్‌ అతలాకుతలం

78చూసినవారు
రెమాల్ తుఫాను.. పశ్చిమబెంగాల్‌ అతలాకుతలం
రెమాల్ తుఫాను ధాటికి పశ్చిమబెంగాల్‌ అతలాకుతలమవుతోంది. దీని ప్రభావంతో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్‌ తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్‌ తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేసింది.

ట్యాగ్స్ :