అమెరికాకు వెళ్లనున్న దలైలామా

64చూసినవారు
అమెరికాకు వెళ్లనున్న దలైలామా
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మోకాలికి శస్త్ర చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. చికిత్స తర్వాత ధర్మశాలకు తిరిగి వచ్చాక ఆయన రెగ్యులర్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జూన్ 20 తర్వాత ఆయన కార్యక్రమాలు షెడ్యూల్ చేయబడతాయని ఆయన కార్యాలయం పేర్కొంది.

సంబంధిత పోస్ట్