ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం

66చూసినవారు
ఢిల్లీలో వాయు కాలుష్యం ఇంకా ప్రమాదకరంగానే ఉంది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిందని నిన్న ఓ నివేదిక వెల్లడైంది. గ్రేడేడ్ రెస్పాన్స్ యాక్షన్స్ ప్లాన్-4 అమలు చేయడంతో కాస్త కాలుష్యం తగ్గింది. అయితే గురువారం ఉదయం 9 గంటల సమయంలో వాయు కాలుష్య నాణ్యత సూచీ 376గా నమోదైంది. ఉష్ణోగ్రత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ శీతాకాలంలోనే ఇది అత్యల్ప ఉష్ణోగ్రతని ఐఎండీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్