ప్రపంచంలో ప్రమాదకరంగా మారుతున్న క్యాన్సర్‌లలో ఉదర క్యాన్సర్ ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం కూడా కష్టమే. సాధారణంగా ఉదర క్యాన్సర్ ప్రారంభంలో ఉండే లక్షణాలు అజీర్ణ సమస్యతో ఉండే లక్షణాలను పోలి ఉంటాయి. అయితే, ముఖంపై వచ్చే కొన్ని లక్షణాలను బట్టి ప్రారంభ దశలోనే ఉదర క్యాన్సర్‌ను గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు.