యూపీలోని ఫరూఖాబాద్ పరిధి భగౌతిపూర్లో షాకింగ్ ఘటన జరిగింది. శశి (16), బబ్లీ (18) అనే ఇద్దరు అమ్మాయిలు సోమవారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామంలోని ఆలయానికి వెళ్లారు. ఇంటికి తిరిగి రాలేదు. అయితే మంగళవారం ఉదయం ఊరు చివర మామిడి చెట్టుకు వారి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. వారిపై సామూహిక అత్యాచారం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.