చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక(వీడియో)

85చూసినవారు
జెప్టో ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన హెర్షీస్ చాక్లెట్ సిరప్ బాటిల్‌లో చనిపోయిన ఎలుకను గుర్తించిన ఒక మహిళ షాక్‌కు గురైంది. మహిళ ప్రమీ శ్రీధర్ ఈ సంఘటనను వీడియోలో రికార్డ్ చేశారు. ఈ వీడియోలో ఆమె కొనుగోలు చేసిన చాక్లెట్‌ సిరప్‌ను చెంచాతో బయటకు తీసింది. దాంట్లో కొన్ని వెంట్రుకలను గుర్తించింది. ప్రమీ "సీల్డ్ క్యాప్" తెరిచి, సిరప్‌ను ఒక కప్పులో పోసింది. దాని నుంచి చనిపోయిన ఎలుక బయటపడింది. వీడియో వైరలవడంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.