పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం.. విద్యార్థిని ఆవేదన

76చూసినవారు
పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం.. విద్యార్థిని ఆవేదన
TG: వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన ఘటనలో నకిరేకల్ కు చెందిన విద్యార్థినిని డీబార్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో తన ప్రమేయమేమీ లేదని, తనను అన్యాయంగా డీబార్‌ చేశారని సదరు విద్యార్థిని ఝాన్సీరాణి కన్నీటిపర్యంతమయ్యింది. తాను పరీక్ష రాస్తుండగా కిటికీ వద్దకు వచ్చిన కొందరు బెదిరించి పేపర్ ఫొటో తీసుకున్నారని వాపోయింది. తనపై డీబార్ ఎత్తివేసి మళ్లీ పరీక్ష రాయనివ్వాలని కోరింది. లేదంటే ఆత్మహత్యే శరణ్యమని కన్నీళ్లు పెట్టుకుంది.