హోటల్స్‌లో ఆధార్‌కు బదులు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని అడ్వకేట్ దీపక్ సోమానీ తెలిపారు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పౌరులు హోటల్ రిసెప్షన్లలో చెక్-ఇన్ సమయంలో ఆధార్ కార్డుకు బదులుగా తమ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్‌ను ఇవ్వాలని దీపక్ సోమానీ సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ కంటే ఆధార్ కార్డులు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.