షాకింగ్: కాలి పట్టీ మింగేసిన చిన్నారి

76చూసినవారు
షాకింగ్: కాలి పట్టీ మింగేసిన చిన్నారి
AP: కాలి పట్టీ మింగేసిన చిన్నారికి ప్రాణాపాయ పరిస్థితి నుంచి వైద్యులు కాపాడారు. శ్రీకాకుళం నగరంలో నివసిస్తున్న యర్నా విన్మయి (2) ఆడుకుంటూ కాలి పట్టీ మింగేసింది. అది గమనించి తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స లేకుండా ఎండోస్కోపీ ద్వారా పట్టీని బయటకు తీశారు. తమ కుమార్తె ప్రాణాలు కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్