దేశ వ్యాప్తంగా ర్యాంగింగ్ భూతానికి 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-24’ నివేదిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం వైద్య కళాశాలల్లో అత్యధిక ర్యాగింగ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. ర్యాగింగ్ సంబంధిత మరణాల్లో 45.1 శాతం మరణాలు వైద్య కళాశాలల్లో ఉండడం గమనార్హం.