మరణమృదంగం.. ఆఫ్గాన్‌లో 300 దాటిన మృతులు (వీడియో)

76చూసినవారు
ఆఫ్గానిస్థాన్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఐరాస ఆహార ఏజెన్సీ వెల్లడించింది. వెయ్యికి పైగా గృహాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. బదాక్షాన్‌, బగ్లాన్‌, ఘోర్‌, హెరాత్‌ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడ భారీగా ప్రాణనష్టం సంభవించింది.

సంబంధిత పోస్ట్