నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు కూడా నెలకొల్పుతామన్నారు. యువతలో నైపుణ్యం పెంచే కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఇక స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ అందజేస్తామని ప్రకటించారు.