బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులో విటమిన్ ఇ, జింక్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. బాదం పప్పులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. బాదం తీసుకోవడం వల్ల.. గుండెతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.