ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. ఈ సీజన్‌లో తొలిసారి గాలి నాణ్యత సూచి 481కి చేరిందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కాగా, ఆదివారం సాయంత్రం గాలి నాణ్యత సూచీ 457గా నమోదైంది. పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలముకోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో విమానాలకు కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.