తెలంగాణలో హామీలు అమలు చేశామని ఢిల్లీలో అబద్ధాల ప్రచారం: హరీష్ రావు

54చూసినవారు
తెలంగాణలో హామీలు అమలు చేశామని ఢిల్లీలో అబద్ధాల ప్రచారం: హరీష్ రావు
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. రేవంత్ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని ఆక్షేపించారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీష్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్