డెలివరీ ఆలస్యమైందని కస్టమర్ తిట్టడంతో చెన్నైలో 19 ఏళ్ల డెలివరీ బాయ్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. డెలివరీ లేట్ పై కస్టమర్ తిట్టడం, ఆపై ఫిర్యాదు చేయడం వంటి విషయాలను లేఖలో ప్రస్తావించాడు. బీకామ్ చదువుతున్న సదరు వ్యక్తి సరుకులు ఇచ్చిన మరుసటి రోజే అతడిపై కస్టమర్ ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కంపెనీ చర్యలు తీసుకుంది. కోపంలో అతడు ఆమె ఇంటిపైకి రాయి విసరగా ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.