రంజిత్‌సింగ్‌ హత్య కేసులో డేరా బాబా నిర్దోషి: హైకోర్టు

82చూసినవారు
రంజిత్‌సింగ్‌ హత్య కేసులో డేరా బాబా నిర్దోషి: హైకోర్టు
డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్ రహీమ్‌ సింగ్‌(డేరా బాబా) తన మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిర్దోషి అని పంజాబ్‌-హర్యానా హైకోర్టు ప్రకటించింది. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా హైకోర్టు నిర్దోషులుగా పేర్కొంది. ఈమేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. రంజిత్‌ 2002 జూలై 10న హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్‌పూర్‌ కొలియన్‌ గ్రామంలో హత్యకు గురయ్యారు.

ట్యాగ్స్ :