రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్

69చూసినవారు
రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
దేశంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక లేన్ రూపొందించే ప్రణాళికను పరిశీలిస్తోంది. నగరాల్లో ద్విచక్ర వాహనాలు, పాదచారుల కోసం ప్రత్యేకలేన్లు, అండర్‌పాస్‌లు, ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, మరణాలలో 44% ద్విచక్ర వాహనాలతో ముడిపడినవే ఉంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్