గమ్యం చేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్

73చూసినవారు
గమ్యం చేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్
పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు ఢీకొని ప్రమాదానికి గురైన కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్ మంగళవారం 850 మంది ప్రయాణికులతో గమ్య స్థానమైన సీల్దాహ్‌కు చేరుకుంది. ప్రమాదంలో దెబ్బతినకుండా మిగిలిన బోగీలతో రైలును తెల్లవారుజామున 3.16 గంటలకు అధికారులు గమ్యస్థానానికి చేర్చారు. ప్రయాణం మధ్యలో అన్ని స్టేషన్లలో ప్రయాణికులకు వైద్య సాయాన్ని, ఆహారాన్ని, మంచినీటిని అందించారు. సీల్దాహ్ నుంచి వారిని ఇళ్లకు చేర్చారు.

ట్యాగ్స్ :