హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తన 50వ చిత్రం 'రాయన్' ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్యాన్స్, చిత్రయూనిట్ తో కలిసి ధనుష్ చెన్నైలోని రోహిణీ థియేటర్లో సినిమా చూశారు. తమ అభిమాన హీరోని చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో మూవీ అయిపోగానే ధనుష్ థియేటర్ లో నుంచి పరుగులు తీశారు. నేరుగా కారు వద్దకు వెళ్లి అందరికీ అభివాదం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.