సిమ్రాన్ షేక్ (22) అనే పేరు ఇప్పుడు మహిళల క్రికెట్ ప్రపంచంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఆమె ధారావి ప్రాంతానికి చెందిన ఓ సాధారణ ఎలక్ట్రీషియన్ కుమార్తె. ఇటీవల WPL 2025 వేలంలో సిమ్రాన్ రూ. 1.9 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌కి అమ్ముడుపోయి, అత్యంత ఖరీదైన భారతీయ క్రికెటర్‌గా నిలిచింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో ముంబై తరఫున 11 మ్యాచ్‌ల్లో 176 పరుగులు చేసి తన ప్రతిభను నిరూపించుకుంది.