ధోనీ ఇంకాస్త ముందు రావాల్సింది: ఇర్ఫాన్

72చూసినవారు
ధోనీ ఇంకాస్త ముందు రావాల్సింది: ఇర్ఫాన్
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓటమిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీ ఇంకా ముందుకు వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. SRH ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్, ఉనద్కత్‌లు పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ హాఫ్ కట్టర్‌లతో చెలరేగుతున్న సమయంలో ధోనీ కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే బాగుండేదని, వారి బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని ఉండేవాడని వ్యాఖ్యానించాడు.

సంబంధిత పోస్ట్