జన్మాష్టమి సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కిట్టయ్యలా ముస్తాబు చేసి మురిసిపోయారు. వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోాయారు. అయితే కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఓ యువకుడు కృష్ణుడిలా రెడీ అయి భక్తులను ఆశ్చర్యపరిచారు. నెమలి పించం ధరించి చేతిలో ఫ్లూట్ పట్టుకుని ఆలయంలో కలియదిరిగారు. ఆ దేవుడే వచ్చాడని కొందరు భక్తులు పాదాభివందనాలు చేశారు. ఈ వీడియో ఎక్స్‌లో వైరలవుతోంది.