మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గేమ్ ఛేంజర్’పై అప్ డేట్స్ మొదలయ్యాయి. నిర్మాత దిల్ రాజు దీనిపై అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. తాజాగా 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ‘క్రిస్మస్కే రిలీజ్ చేద్దామనుకున్నాం. సంక్రాంతికి బెస్ట్ అనిపించి రిలీజ్ డేట్ మార్చాం’ అని ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.