ఇళయరాజాపై దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. విశాల్‌ ఆగ్రహం

59చూసినవారు
ఇళయరాజాపై దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. విశాల్‌ ఆగ్రహం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకు మిస్కిన్‌‌ తీరుపై నటుడు, నడిగర్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ విశాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిధంగా వ్యవహరించడం మిస్కిన్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. ఎంతోమంది సంగీతప్రియులు ఆరాధించే ఇళయరాజా గురించి అలాంటి కామెంట్స్‌ చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఆ తర్వాత రోజు క్షమాపణలు చెబితే మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.