స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11.04 గంటల సమయానికి సెన్సెక్స్ 780 పాయింట్లు నష్టపోయి 75,409 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 244 పాయింట్లు నష్టపోయి 22,845 వద్ద ట్రేడవుతోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఆశించిన మేర ఉండకపోవచ్చన్న భావనలకు తోడు, కార్పొరేట్ సంస్థలు ఆర్థిక ఫలితాల్లో అంతగా రాణించకపోవడమూ ఈ నష్టాలకు కారణంగా తెలుస్తోంది.