తమిళనాడులో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా పోలీస్ కమిషనర్ థామ్సన్ జోస్ గుండెపోటుకు గురై కుప్పకూలారు. సిబ్బంది వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించడంతో కోలుకున్నారు.