రాజ్కోట్ ప్రమాదంలో విస్తుగొల్పే విషయాలు బహిర్గతం

53చూసినవారు
రాజ్కోట్ ప్రమాదంలో విస్తుగొల్పే విషయాలు బహిర్గతం
గుజరాత్ లోని రాజ్కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విస్తుగొల్పే నిజాలు బయటపడుతున్నాయి. గేమింగ్ జోన్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదని అధికారులు తెలిపారు. ఆ జోన్ కు రాకపోకలకు ఒకే దారి ఉందని చెప్పారు. ప్రమాదాన్ని గుర్తించిన ప్రజలు ఎక్జిట్ నుంచి బయట పడాలని ప్రయత్నించారని, కానీ అప్పటికే ఎగ్జిట్ మూసుకుపోవడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.