విమానం ఇంజిన్‌ను ఢీకొట్టిన పక్షి.. వెనక్కి మళ్లింపు

68చూసినవారు
విమానం ఇంజిన్‌ను ఢీకొట్టిన పక్షి.. వెనక్కి మళ్లింపు
దేశ రాజధాని ఢిల్లీలో విమానం ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టింది. కాగా, స్పైస్‌జెట్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ఢిల్లీ నుంచి లేహ్‌కు టేకాఫ్‌ అయిన ఎస్‌జీ-123 సర్వీసుకు చెందిన బీ737 విమానం ఇంజిన్ 2ను పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ప్రయాణికులు సాధారణంగానే విమానం నుంచి దిగారు’ అని ప్రకటించారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాకుండా సాధారణంగా ల్యాండింగ్ చేసినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్