తుఫాన్ ఎఫెక్ట్.. 394 విమానాలు రద్దు

69చూసినవారు
తుఫాన్ ఎఫెక్ట్.. 394 విమానాలు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బెంగాల్ తీరం వైపుగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు 394 విమానాలను రద్దు చేస్తున్నట్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయం 63 వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 80-90కి.మీ వేగంతో ఈదురుగాలులు, 200మీ.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.